మైనర్ బాలికపై అత్యాచారం.. సంచలన తీర్పు వెల్ల‌డించిన రంగారెడ్డి కోర్టు

Ranga Reddy Court Imposes Life Sentence To a Man Who Rapes Minor Girl. రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన‌ తీర్పు వెల్లడించింది.

By Medi Samrat  Published on  19 Feb 2021 3:22 PM GMT
మైనర్ బాలికపై అత్యాచారం.. సంచలన తీర్పు వెల్ల‌డించిన రంగారెడ్డి కోర్టు

రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన‌ తీర్పు వెల్లడించింది. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన నిందితుడికి కోర్టు యావ‌జ్జీవ కారాగార శిక్ష‌ను విధించింది. నిందితుడు బండారి నగేష్ 2016లో.. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదు అయింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అన్ని ఆధారాలతో సహా నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు తీర్పుపై సీపీ మహేష్ భగవత్ హర్షం వ్యక్తం చేశారు.

వివ‌రాళ్లోకెళితే.. ఎల్.బి నగర్‌లోని బండ్లగుడలో నివాసం ఉండే భవన నిర్మాణ కార్మికుడు బండారి నాగేష్(29) భార్యకు విడాకులు ఇచ్చాడు. ఈ క్ర‌మంలోనే మైనర్ బాలిక (17)తో పరిచయం పెంచుకున్నాడు. బాలికను ప్రేమిస్తున్నట్లుగా నమ్మించి.. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. ఆ తర్వాత కిడ్నాప్ చేసి, యాదగిరిగుట్టకు తీసుకెళ్ళి వివాహం చేసుకున్నాడు. ఆ త‌ర్వాత‌ మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేస్తూ..కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురి చేసేవాడు. తన కోరికను నెరవేర్చకపోతే పెళ్లి ఫోటోలను బాలిక బంధువులందరికీ పంపిస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసేవాడు.

నాగేష్ బెదిరింపులను బాలిక లెక్క చేయలేదు. కాలేజీకి వెళ్లడానికి చైతన్యపురి బ‌స్టాప్ వ‌ద్ద బ‌స్‌కై ఎదురు చూస్తున్న సమయంలో కిడ్నాప్ చేసి రూమ్‌లో బంధించి వారం రోజుల పాటు ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఎట్ట‌కేల‌కు అత‌డి చెర నుండి త‌ప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత‌డిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. తాజాగా ఈ కేసులో రంగారెడ్డి కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.


Next Story
Share it