మాట్లాడటం మానేసిందని.. మహిళా బంధువును కత్తితో పొడిచి చంపిన వ్యక్తి
రాజస్థాన్‌లోని కోటలోని తల్వాండి ప్రాంతంలో మంగళవారం నాడు 52 ఏళ్ల మహిళను తన ఇంట్లోనే కత్తితో చంపినందుకు 49 ఏళ్ల వ్యక్తిని
By అంజి Published on 25 May 2023 10:44 AM ISTమాట్లాడటం మానేసిందని.. మహిళా బంధువును కత్తితో పొడిచి చంపిన వ్యక్తి
రాజస్థాన్‌లోని కోటలోని తల్వాండి ప్రాంతంలో మంగళవారం నాడు 52 ఏళ్ల మహిళను తన ఇంట్లోనే కత్తితో చంపినందుకు 49 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మృతురాలిని భావన గౌతమ్‌గా గుర్తించారు. నరేంద్ర అనే నిందితుడు కోటలోని సంగోడ్ జిల్లా తాండా నివాసి. బుధవారం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మృతురాలి కుమార్తె ఫిర్యాదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ శరద్ చౌదరి తెలిపారు. ''తన తండ్రి రాకేష్ గౌతమ్ చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారని మృతురాలి కూతురు వెల్లడించింది. సాంగోడ్‌లో నివాసం ఉండే ఆమె తల్లి తన మామ నరేంద్రతో తరచూ మాట్లాడుతుండేది. అతను తరచూ వారి ఇంటికి కూడా వెళ్లేవాడు. అయితే గత కొన్ని రోజులుగా ఆమె తల్లి నరేంద్రతో మాట్లాడడం మానేసింది. అందుకే చంపేస్తానని బెదిరించాడు'' అని పోలీసు అధికారి శరద్ చౌదరి తెలిపారు.
''మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కత్తితో మా ఇంట్లోకి ప్రవేశించి మా అమ్మపై దాడి చేశాడు. మా అమ్మ సహాయం కోసం అరుస్తూ బయటికి వెళ్లినప్పుడు, అతను నాపై కూడా దాడి చేశాడు, నా తల, కుడి చేతికి గాయాలయ్యాయి. ఇంతలో నా సోదరుడు నమన్ బయటికి వెళ్లి మా మామను పట్టుకోగలిగాడు'' అని హిరుల్ పోలీసులకు చెప్పింది. కొద్దిసేపటికే పోలీసులు వచ్చారు. ఘటనా స్థలం నుంచి నిందితుడిని అదుపులోకి తీసుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చౌదరి తెలిపారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. హత్యా నేరం కింద నిందితుడిని అరెస్టు చేశారు.