ఆర్మీ అధికారినని చెప్పి.. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి.. దారుణం..

Pune Crime News. మ్యాట్రిమోనియల్ పోర్టల్ ద్వారా పరిచయమైన అమ్మాయిని మోసగించిన ఓ వ్యక్తిని పూణే

By Medi Samrat  Published on  29 Nov 2021 1:23 PM GMT
ఆర్మీ అధికారినని చెప్పి.. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి.. దారుణం..

మ్యాట్రిమోనియల్ పోర్టల్ ద్వారా పరిచయమైన అమ్మాయిని మోసగించిన ఓ వ్యక్తిని పూణే పోలీసులు అరెస్టుచేశారు. ఆ వ్యక్తి తన ఇష్టానికి విరుద్ధంగా తనతో సెక్స్ చేశాడని, ఆ తర్వాత తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడని బాధితురాలు ఆరోపించింది. నిందితుడిని కర్ణాటకలోని బెల్గాంలోని కుంపత్‌గిరి నివాసి ప్రశాంత్‌ భౌరావ్‌ పాటిల్‌గా గుర్తించారు పోలీసులు. నిందితుడు మ్యాట్రిమోనియల్ సైట్‌ల ద్వారా ప‌రిచ‌య‌మైన‌ చాలా మంది మహిళలను మోసం చేశాడని పోలీసులు గుర్తించారు. నిందితుడు 2018 నుండి పరారీలో ఉన్నాడని.. అప్ప‌టి నుండి ఈ ఏడాది నవంబర్ 20 వరకు పూణే, లాతూర్, అహ్మద్‌నగర్‌లలో అతనిపై ఐదు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.

తాజా కేసులో పాటిల్‌ను వివాహ వేదికపై కలిశారని బాధితురాలు ఆరోపించింది. తాను ఆర్మీ అధికారినని చెప్పి.. వివాహం చేసుకుంటాన‌ని న‌టించి లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆ త‌ర్వాత‌ ఆమె ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడు. అయితే.. నవంబరు 18న బాధిత యువ‌తి, పాటిల్ కలుసుకున్నారు. అప్పుడు పాటిల్ ఆర్మీ దుస్తులలో ఉన్నాడు. సింహగఢ్ రోడ్డులోని ఓ లాడ్జిలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనంత‌రం లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. ఈ విష‌యం ఎవ‌రితో చెప్పొద్ద‌ని బాధితురాలి వ‌ద్ద మాట తీసుకున్నాడు. ఆమె లాడ్జి నుంచి బయటకు వెళ్లిన తర్వాత.. పాటిల్ ఆమె ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసి ప‌రార‌య్యాడు. దీంతో బాధిత‌ యువ‌తి అత‌డిపై పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదుచేసింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అత‌డిని జ్యూడిషియ‌ల్ క‌స్ట‌డీకి తర‌లించారు.


Next Story
Share it