సైకో వీరంగం.. న‌గ్నంగా క‌త్తి ప‌ట్టుకుని తిరుగుతూ..

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి కోమలా నగర్ లో సైకో వీరంగం సృష్టించాడు.

By Medi Samrat  Published on  22 May 2024 9:30 AM IST
సైకో వీరంగం.. న‌గ్నంగా క‌త్తి ప‌ట్టుకుని తిరుగుతూ..

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి కోమలా నగర్ లో సైకో వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఒంటి మీద బట్టలు లేకుండా చల్లపల్లి ప్రధాన సెంటర్లలో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. న‌డిరోడ్డు మీద న‌గ్నంగా కూర్చుని హ‌ల్‌చ‌ల్ చేసిన ఆ వ్య‌క్తిని పోలీసులు శివగా గుర్తించారు.

కోమల నగర్ గుడారాల వద్ద జరిగిన ఘర్షణలో శివ గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘ‌ర్ష‌ణ అనంత‌రం శివ మద్యం మత్తులో తీవ్ర గాయాలతో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ చల్లపల్లి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినట్లు వెల్ల‌డించారు. పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా కూర్చుని హల్చల్ చేశాడు. శివను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి గాయాలతో ఉన్న అత‌డిని చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story