మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
Prostitution racket busted in Banjara Hills apartment 10 women rescued. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను
By Medi Samrat Published on 27 Jun 2023 8:55 AM GMTహైదరాబాద్ బంజారాహిల్స్‌లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని ఓ అపార్ట్ మెంట్ లో నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మసాజ్ సెంటర్ పై దాడి చేశారు. ఈ దాడులలో ముగ్గురు నిర్వాహకులు, 10 మంది యువతులు, 18 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. శృతి, రమణ, జహీద్ ఉల్ హక్ అనే ముగ్గురు మసాజ్ సెంటర్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు. ముగ్గురు నిర్వాహకులపై పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. మసాజ్ సెంటర్‌లో పట్టుబడిన యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించారు.
మసాజ్ సెంటర్ నిర్వాహకురాలైన శృతి.. డాక్టర్ కావాలి అనుకుంది. ఉక్రెయిన్ లో మెడిసిన్ సీట్ సంపాదించింది. మొదటి సంవత్సరం పూర్తి చేసిన తర్వాత.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మెడిసిన్ విద్యను మధ్యలోనే ఆపేసింది. అనంతరం పలుచోట్లు ఉద్యోగాలు చేసింది. ఇవేవి ఆర్ధిక ఇబ్బందులనుంచి తనను బయటపడేయకపోవడంతో.. ఈజీ మనీ సంపాదించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే మరో ఇద్దరితో కలిసి ఆయుర్వేదిక్ వైద్యం పేరుతో స్పా సెంటర్‌ను మొదలుపెట్టింది. అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తూ ఈజీ మనీకి అలవాటుపడింది. పంజాగుట్ట పోలీసులు మసాజ్ సెంటర్ లో దాడులు చేసి శృతిని అదుపులో తీసుకుని.. జైలుకు పంపారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా మరలా అదే వృత్తిని ఎంచుకుంది. ఈ సారి బంజారాహిల్స్ కేంద్రంగా స్పా సెంటర్ తెరిచింది. దీంతో రెండోసారి శృతి పోలీసులకు చిక్కింది.