సినిమా ప్రపంచంలో స్టార్ అవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఎంతో మంది కన్న కలలను సాకారం చేసుకోడానికి, రంగుల ప్రపంచంలో తమకంటూ ఓ స్థానం దక్కించుకోడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరికి అదృష్టం కలిసి వచ్చి స్టార్స్ అయితే.. ఇంకొందరు విధి ఆడే వింత నాటకంలో పాత్రధారులుగా మిగిలిపోతూ ఉంటారు. సినిమా ప్రయత్నాల్లో ఉన్న కొందరిని మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు. అలా ఓ అమ్మాయి లక్షలు మోసపోయింది. హీరోయిన్ చేస్తానని చెప్పిన సదరు వ్యక్తి మోసం చేయడంతో పోలీసులను ఆశ్రయించింది.
సినిమాల్లో అవకాశం ఇప్పిస్తాను, స్టార్ హీరోయిన్ ను చేస్తానని ఓ మహిళను దాదాపు 27 లక్షల మేర మోసం చేసిన సినీ నిర్మాతను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. మలప్పురానికి చెందిన షక్కీర్ ఎంకే అనే వ్యక్తిని పలారివట్టం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్రిక్కాకరకు చెందిన మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సినిమా నిర్మాణానికి ఆర్ధిక సమస్యలు వున్నాయని సదరు మహిళకు నిర్మాత చెప్పాడు.. దీంతో ఆమె 27 లక్షల వరకు అందజేసింది. అతడు ఆమెను హీరోయిన్ గా పరిచయం లేదు సరికదా.. డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేయడంతో నిందితులు ఆమెను బెదిరించడంతో పాటు బాధితురాలి మొబైల్ నెంబర్‌కు అభ్యంతరకరమైన సందేశాలు పంపారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన వలారిపట్టం ఇన్‌స్పెక్టర్ జోసెఫ్ సాజన్ నేతృత్వంలోని పోలీస్ బృందం నిందితుడు కోజికోడ్‌లో వున్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అరెస్ట్ చేశారు.