నిండు గర్భిణిని దారుణంగా హత్య చేసిన అత్త.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి మూడు బస్తాల్లో వేసి..
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ గర్భిణిని ఆమె అత్త హత్య చేశారు.
By Medi Samrat Published on 18 Nov 2024 4:51 AM GMTపాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ గర్భిణిని ఆమె అత్త హత్య చేశారు. హత్య తర్వాత ఆమె ముగ్గురు సహచరులతో కలిసి కోడలి మృతదేహాన్ని ముక్కలుగా నరికి కాలువలో విసిరేసింది. లాహోర్‌కు 100 కిలోమీటర్ల దూరంలోని సియాల్‌కోట్ జిల్లాలోని దస్కాలో గత వారం ఈ ఘటన జరిగింది. ఈ మేరకు పోలీసులు నిన్న సమాచారం అందించారు.
ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను మృతురాలి అత్త సుఘరన్ బీబీ, ఆమె కుమార్తె యాస్మిన్, ఆమె మనవడు హంజా, దూరపు బంధువు నవీద్‌గా గుర్తించారు. మృతురాలు జారా ఖాదిర్ (20) గత వారం కనిపించకుండా పోయింది. తర్వాత పోలీసులు మూడు బస్తాల్లో జారా మృతదేహాన్ని గుర్తించారు. నిందితులపై హత్య కేసు నమోదు చేశారు.
ఓ పోలీసు అధికారి కుమార్తె అయిన జారా నాలుగేళ్ల క్రితం ఖాదిర్ అహ్మద్‌ను వివాహం చేసుకుంది. వీరికి మూడేళ్ల కొడుకు ఉన్నాడు. పెళ్లయ్యాక భర్తతో పాటు ఆమె సౌదీ అరేబియా వెళ్లింది. కొన్ని నెలల క్రితం ఆమె పాకిస్థాన్‌కు తిరిగి వచ్చింది.
సీనియర్ పోలీసు అధికారి ఉమర్ ఫరూక్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. జారాను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసినట్లు నిందితులు అంగీకరించారని వెల్లడించారు. నేరాంగీకార పత్రంలో సుఘరన్ బీబీ.. జారా మంత్రవిద్యలు ప్రయోగిస్తుందని తాను అనుమానిస్తున్నట్లు తెలిపింది. ఇది కాకుండా.. ఆమె కుమారుడు ఖదీర్ తనకు బదులుగా నేరుగా జరాకు డబ్బు పంపడం ప్రారంభించాడు. దీంతో కొపం పెంచుకున్న వారు.. జారా నిద్రిస్తున్న సమయంలో దిండుతో అదిమిపట్టి చంపారని పోలీసు అధికారి తెలిపారు. ఆ తర్వాత ఆమె ముఖాన్ని కాల్చివేసి.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి మూడు బస్తాల్లో వేసి కాలువలో పడేశారు. జరా తండ్రికి సుఘ్రన్‌పై అనుమానం వచ్చింది. సుఘరన్ బీబీ.. జరా తండ్రికి సోదరి.
ఇది అసూయతో కూడిన అంశమని పోలీసులు అన్నారు. అత్త, ఆమె కుమార్తె జారాను హత్య చేయడమే కాకుండా ద్వేషంతో ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికారు. సుఘరన్ బీబీ, యాస్మిన్.. జరా అందం కారణంగా.. ఖదీర్ ఆమె చెప్పినదల్లా వింటున్నాడని.. ఇతరులను విస్మరిస్తున్నాడని కూడా కోపం పెంచుకున్నారని పోలీసుల విచారణలో తేలింది. నిందితులపై హత్య కేసు నమోదు చేశారు.