హై స్పీడ్ విధ్వంసం.. పోర్షే-బిఎమ్‌డబ్ల్యూ రేస్‌లో ఘోర‌ ప్రమాదం

ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై బుధవారం అర్థరాత్రి ఘోర‌ ప్రమాదం జరిగింది.

By -  Medi Samrat
Published on : 9 Oct 2025 9:28 AM IST

హై స్పీడ్ విధ్వంసం.. పోర్షే-బిఎమ్‌డబ్ల్యూ రేస్‌లో ఘోర‌ ప్రమాదం

ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై బుధవారం అర్థరాత్రి ఘోర‌ ప్రమాదం జరిగింది. ఒక పోర్షే కారు BMWతో రేసింగ్ చేస్తున్నప్పుడు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో పోర్స్చే కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అత‌డు ఎలా ఉన్నాడ‌నే స‌మాచారం ఇంకా తెలియ‌రాలేదు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు కార్లు అతివేగంతో దూసుకుపోతుండగా, పోర్షే కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత బ్లూ కలర్ పోర్స్చే పూర్తిగా దెబ్బతింది.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే పూర్తి సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో పోర్స్చే ముందు భాగం నుజ్జునుజ్జ‌య్యింది. ముంబై రోడ్లు రాత్రిపూట ఖాళీగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రేసింగ్ సమయంలో రెండు కార్ల వేగం చాలా ఎక్కువగా ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Next Story