ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ డీజే
Popular DJ Azex found hanging in his Bhubaneswar home. ఒడిశాకు చెందిన ప్రముఖ డీజే, అక్షయ్ కుమార్ అలియాస్ డీజే అజెక్స్ ఆత్మహత్య చేసుకున్నాడు.
By M.S.R Published on
19 March 2023 11:15 AM GMT

DJ Azex
ఒడిశాకు చెందిన ప్రముఖ డీజే, అక్షయ్ కుమార్ అలియాస్ డీజే అజెక్స్ ఆత్మహత్య చేసుకున్నాడు. భువనేశ్వర్‌లోని ఖరాబేలా నగర్‌లోని తన నివాసంలో ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం తన గదిలో ఉరివేసుకుని కనిపించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతన్ని క్యాపిటల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ అతను చనిపోయినట్లు డాక్టర్ ప్రకటించారు.
“నిన్న సాయంత్రం వర్షం కురుస్తున్నప్పుడు అతను తన గదిలో ఉన్నాడు. మేము అతన్ని భోజనానికి పిలిచినప్పుడు, అతను తలుపు తెరవలేదు. మేము తలుపు బద్దలు కొట్టి చూడగా అతను ఉరి వేసుకుని కనిపించాడు” అని DJ అజెక్స్ తండ్రి భగబన్ మహారాణా తెలిపారు. DJ మరణం వెనుక ప్రేమ వ్యవహారం ఉండొచ్చని అజెక్స్ బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ ఆరోపించాడు. “గత 15 రోజులుగా తన స్నేహితురాలి కారణంగా అజెక్స్ మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. తన ప్రియురాలి కోసం స్కూటీని కూడా కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు, ” అని రాహుల్ తెలిపాడు. అజెక్స్ తల్లి నుండి వ్రాతపూర్వక ఫిర్యాదు అందుకున్న తర్వాత, ఖరాబేలా నగర్ పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.
Next Story