కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తీవ్ర సంచలనం సృష్టించిన బాలిక సహస్ర (12) హత్య కేసును పోలీసులు చేధించారు
By Knakam Karthik
వీడిన మిస్టరీ.. కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో పదవ తరగతి బాలుడే నిందితుడు
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తీవ్ర సంచలనం సృష్టించిన బాలిక సహస్ర (12) హత్య కేసును పోలీసులు చేధించారు. బాలిక ఇంటి పక్కన నివాసం ఉండే బాలుడు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. బాలుడు దొంగతనం కోసం సహస్ర ఇంట్లోకి వచ్చాడు. అయితే దొంగతనం ఎలా చేయాలో ఒక పేపర్ మీద వచ్చి రాని ఇంగ్లీషులో రాసుకున్నారు. హౌ టు ఓపెన్ డోర్ , హౌ టు బ్రేక్ గాడ్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అంటూ వచ్చిరాని ఇంగ్లీష్ లో ఒక లెటర్ రాసుకున్నాడు. సహస్ర తల్లిదండ్రులు వెళ్లిపోయిన తర్వాత ఈ బాలుడు సహస్ర ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్ళాడు.
ఇంట్లో దేవుడి దగ్గర ఉన్న హుండీ ని పగలగొట్టే యత్నం చేస్తున్న సమయం లో సహస్ర అక్కడకు వచ్చింది. దీంతో భయపడి పోయిన ఆ బాలుడు దొంగతనం విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెబుతుందని భయపడి.. తనతో తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా సహస్ర పై దాడి చేసి ఆమె గొంతులో పొడిచాడు. దీంతో సహస్ర కింద పడిపోయింది. అనంతరం కింద పడిపోయిన సహస్ర పై 18 పోట్లు పొడిచి ... సహస్ర ఇంట్లో నుండి పక్క బిల్డింగ్ లోకి వెళ్లిపోయాడు. పక్క బిల్డింగ్ లో 15 నిమిషాల పాటు దాక్కున్నాడు.
అయితే హత్య జరిగిన దగ్గర నుండి గత ఐదు రోజులుగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బాలుడిని గమనిస్తూ ఉన్నాడు. బాలుడి వ్యవహారం కొంత డిఫరెంట్‌గా కనిపించడంతో ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎస్ఓటి బృందానికి సమాచారాన్ని అందించారు. దీంతో ఎస్ఓటి బృందం బాలుడు చదువు తున్న స్కూల్ కి వెళ్లి విచారణ చేశారు. కానీ బాలుడు నోరు విప్పలేదు. ఎస్ఓటి పోలీసులు బాలుడు ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా వచ్చిరాని ఇంగ్లీషులో రాసుకున్న లెటర్, ఒక కత్తి ,రక్తంతో కూడిన దుస్తులు బయటపడ్డాయి. దీంతో ఎస్ పోటీ బృందం వెంటనే బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ బాలుడు పక్క బిల్డింగ్ లో నుండి సహస్ర ఇంట్లోకి వచ్చి ఉంటాడని ఎస్ఓటి బృందం గుర్తించారు.