హైదరాబాదులోని మూసాపేట్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఎవర్‌గ్రీన్ ఫ్యామిలీ బార్ అండ్ రెస్టారెంట్‌పై సైబరాబాద్ పోలీసులు రైడ్ చేశారు. మహిళలతో అసభ్యకరమైన డ్యాన్స్ పార్టీలను నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఆ తర్వాత 11 మంది మహిళా డ్యాన్సర్లను, ఇద్దరు డీజేలను పోలీసులు అదుపులోకి తీసుకోగా, బార్ మేనేజర్ పరారీలో ఉన్నారు. బార్ యజమానిపై కేసు నమోదు చేశారు.
మహిళలతో అసభ్య నృత్యం చేస్తున్న వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవ్వడంతో అధికారులు ఈ ఆపరేషన్ చేపట్టారు. మేనేజ్‌మెంట్ ఫ్యామిలీ బార్ అండ్ రెస్టారెంట్‌ను చట్టవిరుద్ధమైన డ్యాన్స్ బార్‌గా మార్చినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని బార్లలో మహిళలతో అసభ్యకరమైన డ్యాన్స్ లకు ఎలాంటి అనుమతి లేదు. అయినా కూడా కొన్ని బార్ లలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు.