డబ్బులు వస్తాయి కదా అని మైనర్లకు సిగరెట్లు, ఇతర మత్తు పదార్థాలను అమ్ముతూ వస్తున్నారు. అలాంటి వారి సమాచారం లభించగానే జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు.రెండు దుకాణాలపై దాడులు నిర్వహించి మైనర్లకు సిగరెట్లను అక్రమంగా విక్రయిస్తున్న మహిళతో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. 9 వేల రూపాయల విలువైన నిషేధిత వస్తువులతో పాటు వివిధ బ్రాండ్లకు చెందిన సిగరెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, శుక్రవారం రాత్రి పరిస్థితిని పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పంపించారు. అక్రమంగా వెంకటగిరిలోని మహిళా షాపు యజమాని విక్రయాలు సాగిస్తూ ఉన్నారు. మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు దుకాణంపై దాడి చేసి, అనేక నిషేధిత సిగరెట్ బ్రాండ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఒకరైన గంధం ప్రమీల (48) 15 ఏళ్ల విద్యార్థితో సహా మైనర్ల బృందానికి నిషేధిత సిగరెట్లను విక్రయిస్తూ పట్టుబడ్డారు. ప్రమీల నేరాలను అంగీకరించింది, ఆర్థిక ఇబ్బందుల వల్ల త్వరగా లాభాల కోసం మైనర్లకు సిగరెట్లు విక్రయించినట్లు వివరించింది. దీంతో పాటు అదే ప్రాంతంలో కె.వెంకటేశ్వర్‌రావు(55)కి చెందిన దుకాణంపై పోలీసులు దాడి చేసి రూ.3వేల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.