మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు 27 ఏళ్ల భవన నిర్మాణ కార్మికుడిని సుల్తాన్ బజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నల్గొండ జిల్లాకు చెందిన మాదా హరికృష్ణగా గుర్తించారు. సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ నుంచి బాలికను విజయవాడకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుని లాడ్జిలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని ప్రస్తుతం రిమాండ్లో ఉంచి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
నల్గొండ జిల్లాకు చెందిన హరి కృష్ణ ఈ నెల 11న సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ నుంచి మైనర్ బాలికను మాయ మాటలతో కిడ్నాప్ చేసి విజయవాడకు తీసుకువెళ్లి హనుమాన్ మందిరంలో పెళ్లి చేసుకున్నాడని సుల్తాన్ బజార్ ఏసిపి శంకర్ తెలిపారు. అనంతరం ఓ లాడ్జి కి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. హరి కృష్ణకి ఇంతక ముందే వివాహం జరిగి విడాకులు తీసుకున్నాడు. బాలిక అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు సుల్తాన్ బజార్ పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలించి హరి కృష్ణను అదుపులోకి తీసుకున్నారు.