నంద్యాల‌లో కానిస్టేబుల్‌ దారుణ హ‌త్య

Police constable brutally hacked to death. ఆదివారం రాత్రి ఓ పోలీసు కానిస్టేబుల్‌ దారుణ హ‌త్యకు గుర‌య్యాడు.

By Medi Samrat
Published on : 8 Aug 2022 11:13 AM IST

నంద్యాల‌లో కానిస్టేబుల్‌ దారుణ హ‌త్య

ఆదివారం రాత్రి ఓ పోలీసు కానిస్టేబుల్‌ దారుణ హ‌త్యకు గుర‌య్యాడు. నంద్యాల శివారులో ఈ ఘటన జరగ్గా.. మృతుడిని సురేంద్రగా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాత్రి 11.00 గంటలకు రాజ్ టాకీస్ వ‌ద్ద‌ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సురేంద్రను కిడ్నాప్ చేశారు. పట్టణ శివార్లలోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా కత్తులతో పొడిచారు. తీవ్ర రక్తస్రావం కావడంతో సురేంద్ర అక్కడికక్కడే తుదిశ్వాస విడిచాడు. సురేంద్రను హత్య చేసిన తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.

కానిస్టేబుల్ హ‌త్య‌తో పట్టణం ఉలిక్కిప‌డింది. హత్య గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నంద్యాల జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) రఘువీరారెడ్డి కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. నిందితుల‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. దుండగులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. ఘ‌ట‌న‌పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Next Story