Mahabubnagar: వివాహేతర సంబంధం.. సీఐపై కానిస్టేబుల్ దాడి
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్)లో సీఐగా పని చేస్తున్న ఇఫ్తేకార్ అహ్మద్‌పై హత్యాయత్నం జరిగింది.
By అంజి Published on 2 Nov 2023 1:56 PM ISTMahabubnagar: వివాహేతర సంబంధం.. సీఐపై కానిస్టేబుల్ దాడి
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్)లో సీఐగా పని చేస్తున్న ఇఫ్తేకార్ అహ్మద్‌పై హత్యాయత్నం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. కానిస్టేబుల్ కత్తితో సీఐపై దాడి చేశారు. ఈ దాడిలో సీఐ తీవ్రంగా గాయపడ్డారు. సీఐని తోటి పోలీసులు, స్థానికులు జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు. కాగా సంఘటన స్థలానికి డీఐజీ చౌహన్, ఎస్పీ హర్షవర్ధన్ చేరుకొని వివరాలను సేకరించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కాగా ఈ సంఘటన పోలీసు వర్గాలలో కలకలం రేపుతోంది. సీఐ ఇఫ్తేకార్ పై కానిస్టేబుల్ జగదీష్ దాడికి పాల్పడ్డాడు. తన భార్యతో సీఐ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో అతడిపై దాడి చేశాడు.
జగదీష్, శకుంతల దంపతులు. ఈ ఇద్దరు కానిస్టేబుళ్లుగా పని చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో సీసీఎస్ సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఇవాళ ఉదయం కానిస్టేబుల్ జగదీష్ ఒక్కసారిగా సిఐ ఇఫ్తేకార్ పై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. దీంతో సీఐ గట్టి అరవడంతో స్థానికులు వచ్చి వెంటనే అతన్ని ఎస్వీఎస్ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం సీఐ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం, హైదరాబాద్ నగరంలోని యశోద హాస్పిటల్ కి తరలించారు. దాడి చేసిన అనంతరం అతను అక్కడి నుండి పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం ఆ ప్రాంతంలో ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.