నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్ పరిధిలోని రామకోటయ్య నగర్ కు చెందిన ఓ యువతిపై ఓ వ్యక్తి విచక్షణరహితంగా దాడి చేసాడు. వ్యభిచారం చేయాలంటూ కర్రతో చితకబాదాడు. యువ‌తి ఎంత బ్రతిమిలాడిన ఆ వ్యక్తి మాత్రం కనికరించలేదు. మరింత రెచ్చిపోయి ఆ యువ‌తిపై దాడి చేశాడు. వేరే వ్యక్తి చేత దాడి దృశ్యాలను వీడియా తీయిస్తూ పైశాచిక ఆనందం పొందాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎస్పీ విజయరావు స్పందించారు. దాడి ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్న పోలీసులు మూడు బృందాలుగా ఏర్ప‌డి గాలింపు చేప‌ట్టారు. దాడి ఘ‌ట‌న‌కు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు వెంకటేష్ ను పోలీసులు కలువాయి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.


సామ్రాట్

Next Story