గన్స్ విక్రయిస్తున్న వ్య‌క్తి అరెస్ట్‌

రాచకొండ క‌మిష‌న‌రేట్‌ పరిధిలో గన్స్ విక్రయిస్తున్న వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

By Medi Samrat  Published on  15 Jan 2025 11:44 AM
గన్స్ విక్రయిస్తున్న వ్య‌క్తి అరెస్ట్‌

రాచకొండ క‌మిష‌న‌రేట్‌ పరిధిలో గన్స్ విక్రయిస్తున్న వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బీహార్‌కు చెందిన హరేకృష్ణ యాద‌వ్ అనే వ్య‌క్తిని అరెస్టు చేసిన‌ పోలీసులు.. అత‌ని వ‌ద్ద‌ నుంచి 3 కంట్రీమేడ్ పిస్ట‌ల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదులోని గ్యాంగ్‌కు విక్రయించేందుకే హరేకృష్ణ ఈ పిస్ట‌ల్స్‌ తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. హరేకృష్ణ తుపాకుల‌ను బుల్లెట్స్‌తో స‌హా భారీ ధ‌ర‌కు విక్రయించేందుకు ప్రయత్నించాడని పోలీసుల విచార‌ణ‌లో తేలిన‌ట్లు స‌మాచారం.

భోజ్‌పూర్‌లో తుపాకులు కొనుగోలు చేసిన హరేకృష్ణ హైదరాబాద్‌కు తీసుకువచ్చి అవసరమైన వారికి విక్రయించాడ‌నికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. భోజ్‌పూర్‌లో తుపాకులు తయారుచేస్తున్న ముఠాని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం. భోజ్‌పూర్‌లో తుపాకుల తయారీ కుటీర పరిశ్రమల మారిపోయిందని.. అక్కడ తుపాకులను తయారుచేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.

Next Story