టూత్ పేస్ట్ దొంగను ఎట్టకేలకు పట్టుకున్నారు

Police arrest 'toothpaste thief' of Delhi from UP. టూత్ పేస్ట్ ను కూడా కొట్టేసేవారు ఉంటారా.. కొట్టేసినా అతడిని పోలీసులు పట్టుకోడానికి టైమ్ వెచ్చిస్తారా

By Medi Samrat  Published on  28 Nov 2022 2:30 PM GMT
టూత్ పేస్ట్ దొంగను ఎట్టకేలకు పట్టుకున్నారు

టూత్ పేస్ట్ ను కూడా కొట్టేసేవారు ఉంటారా.. కొట్టేసినా అతడిని పోలీసులు పట్టుకోడానికి టైమ్ వెచ్చిస్తారా అనే డౌట్ మీకు తప్పకుండా వస్తుంది. కానీ మీరు కొంచెం గ్రాండ్ గా ఆలోచించాలి. అతడు కొట్టేసింది ఏకంగా 11 లక్షల విలువైన టూత్ పేస్ట్. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని లాహోరీ గేట్ ప్రాంతంలోని గోదాము నుండి రూ. 11 లక్షల విలువైన టూత్‌పేస్ట్‌ డబ్బాలను దొంగిలించిన వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో అతని ఇంటిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కున్వర్ పాల్ సింగ్ అనే వ్యాపారి నవంబర్ 22న లాహోరీ గేట్ పోలీసులకు తన గోదాములో 215 కార్టన్‌ల టూత్‌పేస్ట్ దొంగిలించారని ఫిర్యాదు చేశాడు. గోదాం మేనేజర్ ఉదయ్ కుమార్ అలియాస్ సంతోష్ ఈ దోపిడీకి పాల్పడ్డాడని ఆరోపించారు. పోలీసుల విచారణలో, నిందితుడు బహ్రైచ్‌కు చెందినవాడని పోలీసులు గుర్తించారు. నవంబర్ 25 సాయంత్రం, ఢిల్లీ పోలీసుల బృందం బహ్రైచ్‌లోని జర్వాల్ రోడ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించింది. జాయింట్ ఆపరేషన్‌లో, ఖాసేపూర్ గ్రామంలోని నిందితుడి అరెస్టు చేసింది. "నిందితుడిని అరెస్టు చేశారు. దొంగిలించబడిన టూత్ పేస్ట్ పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి గురైన వస్తువుల విలువ సుమారు రూ.11 లక్షలు. అతన్ని ఢిల్లీకి తీసుకువెళ్లారు" అని బహ్రైచ్‌లోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేశవ్ ప్రసాద్ చౌదరి తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖాసేపూర్ బహ్రంపూర్ గ్రామంలో సంతోష్ తలదాచుకున్నాడన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఉత్తరప్రదేశ్‌లోని స్థానిక పోలీసులను సంప్రదించిన తరువాత, ఢిల్లీ పోలీసులు నేరుగా సంతోష్ ఇంటికి చేరుకుని అతన్ని పట్టుకున్నారు. ఇంట్లో సోదా చేయగా టూత్ పేస్టు పెట్టెలు కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.


Next Story