16 ఏళ్ల బాలిక హత్యాచార కేసు.. 35 మంది అరెస్ట్‌.. మరో 10 మందిని

Pilibhit murder case.. 35 arrested, family members demand CBI probe. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని పిలిభిత్‌ జిల్లా బర్ఖేడా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కలకలం రేపిన 16 బాలిక హత్యాచార కేసులో 35 మందిని పోలీసులు

By అంజి  Published on  18 Nov 2021 8:06 AM GMT
16 ఏళ్ల బాలిక హత్యాచార కేసు.. 35 మంది అరెస్ట్‌.. మరో 10 మందిని

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని పిలిభిత్‌ జిల్లా బర్ఖేడా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కలకలం రేపిన 16 బాలిక హత్యాచార కేసులో 35 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాలిక హత్యాచార కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ధర్నాలు చేస్తున్నారు. కాగా బాలిక హత్యాచార ఘటనలో పెద్ద సంఖ్యలో నిందితులు ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే 12 బృందాలతో దర్యాప్తు సాగిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 35 మందిని అరెస్ట్‌ చేశారు. మరో 10 మందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే..

బర్ఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామం దగ్గర చెరకు తోటలో మైనర్ బాలిక మృతదేహం నగ్నంగా పడి ఉంది. విద్యార్థిని నోటిలో గుడ్డ బిగించి, మెడలో చున్నీ ఉండడాన్ని గుర్తించారు. ఒక రోజు వరకూ బాలిక ఇంటికి రాకపోవడంతో తండ్రి మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆమె మృతదేహం లభ్యం కావడంతో బాధితురాలి తండ్రి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఘ‌ట‌న‌పై సామూహిక అత్యాచారం, హత్య కేసులను పోలీసులు నమోదు చేశారు. దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఆ తర్వాత అర్థరాత్రి గ్రామానికి 500 మీటర్ల దూరంలోని చెరుకు తోటలో అమ్మాయి మృతదేహం వివస్త్రగా కనిపించింది.

అదే సమయంలో ఘటనా స్థలంలో ఆమె సైకిల్, బూట్లు, పుస్తకాలు లభ్యమయ్యాయి. పాప మృతదేహం దగ్గర 4 బీరు సీసాలు, సిగరెట్లు పడి ఉన్నాయి. మాజీ మంత్రి హేమ్‌రాజ్‌ వర్మ సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అయితే బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసును సీబీఐ విచారించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story