సూర్యపేటలో విషాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం
Petrol Tanker Blast In Suryapet. సూర్యాపేట కొత్త బస్టాండ్ సమీపంలో సోమవారం భారీ ప్రమాదం జపిగింది.
By Medi Samrat Published on 7 Feb 2022 2:05 PM GMT
సూర్యాపేట కొత్త బస్టాండ్ సమీపంలో సోమవారం భారీ ప్రమాదం జపిగింది. గ్యాస్ వెల్డింగ్ పనులు జరుగుతుండగా ఖాళీ పెట్రోల్ ట్యాంకర్ పేలడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్లో భయాందోళన నెలకొంది. గ్యాస్ వెల్డింగ్ షాపులో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను మంత్రి అర్జున్(36) గట్టు అర్జున్(52)గా గుర్తించారు. ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైద్రాబాద్ తరలించారు. సంఘటనా స్థలాన్ని పోలీసు సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్, డీఎస్పీ మోహన్ కుమార్ సందర్శించి సంఘటనపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.