తమిళనాడులోని మధురై జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నవజాత శిశువును పూడ్చిపెట్టిన తర్వాత దంపతులు ఇద్దరు కుమార్తెలతో సహా అదృశ్యమయ్యారు. ఆరు రోజుల పసికందు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో స్థానిక ఆరోగ్య అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పసికందు చనిపోయిందని ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం ఇవ్వకుండా పూడ్చిపెట్టిన తర్వాతే ఆడశిశువుల హత్య కేసుగా అనుమానిస్తున్నారు. ఓ జాతీయ దినపత్రిక కథనం ప్రకారం.. డిసెంబర్ 21న సేడపట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ ముత్తుపాండి, కౌసల్య దంపతులకు ఆరోగ్యకరమైన బిడ్డ జన్మించింది.

డిసెంబరు 26న ఒక గ్రామ నర్సు తల్లి, బిడ్డను తనిఖీ చేయడానికి వెళ్ళిన తర్వాత శిశువు కనిపించలేదు. శిశువు చనిపోయిందని దంపతులు నర్సుకు సమాచారం అందించి ఇంటి ముందు పూడ్చిపెట్టారు. దీంతో నర్సు పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అధికారులు మృతదేహాన్ని వెలికితీసి, మరణానికి గల కారణాలను నిర్ధారించడానికి పోస్ట్‌మార్టం నిర్వహించవచ్చు. చిన్నారి మృతదేహాన్ని రహస్యంగా పాతిపెట్టారనే ఆరోపణలపై ఐపీసీ సెక్షన్ 318 కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story