కొడుకు హిజ్రాను ప్రేమించాడని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. నంద్యాలకు చెందిన సుబ్బరాయుడు, సరస్వతి దంపతుల కొడుకు సునీల్ బీటెక్ ఫస్టియర్ ఫెయిలై ఆటో డ్రైవర్లతో కలిసి తిరుగుతున్నాడు.
ఓ హిజ్రాతో పరిచయం అయింది. ఆమెనే ప్రేమిస్తున్నానంటూ సునీల్ చెప్పుకోవడం మొదలు పెట్టాడు. ఇదే విషయం చివరికి కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది. కొడుకు ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని తెలిసి తల్లిదండ్రులు అతడిని మందలించారు. హిజ్రా గ్యాంగ్ వారి షాపుకు వచ్చి బూతులు తిడుతూ హంగామా చేశారు. దీంతో అవమానం తట్టుకోలేక సునీల్ తల్లిదండ్రులు పురుగుల మందు తాగి చనిపోయారు.