ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తుండగా అయిపోయిన ఆక్సిజన్.. మహిళ మృతి
మీరట్‌లోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో షిప్టింగ్ చేస్తుండగా ఆక్సిజన్ అందక ఓ మహిళ మృతి చెందింది.
By Medi Samrat Published on 17 May 2024 9:52 AM ISTమీరట్‌లోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో షిప్టింగ్ చేస్తుండగా ఆక్సిజన్ అందక ఓ మహిళ మృతి చెందింది. రోగిని ఎమర్జెన్సీకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లోని ICUకి తరలిస్తుండగా ఘటన చోటుచేసుకుంది. రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారడం చూసి.. వెంట ఉన్న అటెండర్లు వార్డు బాయ్‌కి సమాచారమిచ్చారు.. కానీ అప్పటికే మహిళ మరణించింది. నిర్లక్ష్యంపై ఐదుగురు వార్డు బాయ్‌లను వివరణ కోరుతూ మెడికల్ కాలేజీ యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది.
రిటైర్డ్ ఉద్యోగి త్రిలోకి భార్య ఇంద్రావతి పరిస్థితి విషమించడంతో బుధవారం అర్థరాత్రి వైద్య కళాశాలలోని అత్యవసర విభాగంలో చేరారు. ఇంద్రావతిని పరీక్షించిన డాక్టర్ సందీప్ మాలియన్ ప్రకారం.. ఆమె శ్వాసకోశ వ్యాధితో బాధపడుతోందని తెలిపారు.
గురువారం ఉదయం 11 గంటలకు రోగిని అత్యవసర విభాగం నుంచి ఐసీయూకి తరలిస్తున్నారు. వార్డ్ బాయ్ ఆక్సిజన్ అప్లై చేసిన తర్వాత రోగిని స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్నాడని త్రిలోకి చెప్పారు. 50 మీటర్లు నడిచేసరికి సిలిండర్‌లోని ఆక్సిజన్ అయిపోయింది. రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి.. తీవ్రమైన వేదనతో చనిపోయింది. ఇది చూసిన బంధువులు ఆగ్రహించి ఎమర్జెన్సీలో బీభత్సం సృష్టించారు. సిఎంఎస్ డాక్టర్ ధీరజ్ రాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని బంధువులతో మాట్లాడి శాంతింపజేశారు.
ఘటన సమయంలో అత్యవసర విధుల్లో ఉన్న ఐదుగురు వార్డు బాయ్‌లకు నోటీసులు జారీ చేసి వివరణ కోరామని సీఎంఎస్ తెలిపారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రిన్సిపాల్ డా.ఆర్.సి.గుప్తా మాట్లాడుతూ.. నేను ఈరోజు నగరం వెలుపల ఉన్నాను. CMS నుండి కేసుకు సంబంధించిన సమాచారం అందింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.