మరదలిపై అత్యాచారం కేసులో బెయిల్‌పై విడుదలై ఆత్మహత్య చేసుకున్నాడు

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని ఇటీవల బెయిల్‌పై విడుదలైన 32 ఏళ్ల వ్యక్తి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

By Medi Samrat
Published on : 23 Jun 2025 9:01 PM IST

మరదలిపై అత్యాచారం కేసులో బెయిల్‌పై విడుదలై ఆత్మహత్య చేసుకున్నాడు

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని ఇటీవల బెయిల్‌పై విడుదలైన 32 ఏళ్ల వ్యక్తి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిరోజాబాద్ దక్షిణ ప్రాంతంలోని హుమాయున్‌పూర్‌కు చెందిన శివం అలియాస్ తను తన ఇంట్లో చనిపోయి కనిపించాడు. సంఘటన జరిగిన సమయంలో అతను ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు.

అతను కాన్పూర్ దేహత్ జిల్లాలోని అక్బర్‌పూర్ ప్రాంతానికి చెందినవాడని, అతని మరదలిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావ‌డంతో అతన్ని అరెస్టు చేశారు. తరువాత అతను బెయిల్‌పై విడుదలై జూన్ 17న కోర్టులో హాజరు అయ్యాడు. ఆ తర్వాత అతను నిరాశకు గురై తమతో దూరంగా ఉన్నాడని అతని కుటుంబం తెలిపింది.

హుమాయున్‌పూర్‌లోని తన ఇంట్లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ యోగేంద్ర పాల్ సింగ్ తెలిపారు. అత్యాచార కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని పోలీసులు చెప్పారు. పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాత ఆత్మహత్యపై దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

Next Story