వీకెండ్ ట్రిప్‌ విషాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి

Out for weekend trip, 3 students drown in reservoir in Karnataka's Chikkaballapur. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఫార్మ్‌ చదువుతున్న 21 ఏళ్ల వ‌య‌సున్న‌ ముగ్గురు విద్యార్థులు

By Medi Samrat  Published on  1 April 2023 8:38 PM IST
వీకెండ్ ట్రిప్‌ విషాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి

బెంగళూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఫార్మ్‌ చదువుతున్న 21 ఏళ్ల వ‌య‌సున్న‌ ముగ్గురు విద్యార్థులు శనివారం కర్ణాటకలోని చిక్కబల్లాపూర్‌లోని శ్రీనివాససాగర్‌ రిజర్వాయర్‌లో మునిగి చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులు వారాంతపు విహారయాత్రకు రిజర్వాయర్‌కు వెళ్లారు. ఆరుగురు విద్యార్థులు ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు. అయితే ఈత రాకపోవడంతో ముగ్గురు నీటిలో మునిగి చనిపోయారు. మృతులను రాధిక, ఇమ్రాన్, పూజగా గుర్తించారు. వీరంతా బెంగళూరులోని సారాయిపాళ్య వాసులు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రిజర్వాయర్‌కు చేరుకుని రెస్క్యూ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టారు. పూజా మృతదేహాన్ని స్వాధీనం చేసుకోగా.. రాధిక, ఇమ్రాన్ మృతదేహాలను వెలికితీసేందుకు ఇంకా శోధన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. చిక్కబళ్లాపూర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story