నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 34 మందికి గాయాలు
One woman killed, 34 passengers injured in Nellore as lorry collides APSRTC bus. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు-బళ్లారి రహదారి బుచ్చిరెడ్డిపాళెం
By Medi Samrat Published on
23 March 2022 11:47 AM GMT

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు-బళ్లారి రహదారి బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు మఠం కాలనీ సమీపంలో ఆగి ఉన్న లారీని ఆత్మకూర్ నుంచి నెల్లూరు వెళ్తున్న పల్లె వెలుగు బస్సు ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డుకు 15 అడుగుల లోతులో ఉన్న పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా.. 34 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
డ్రైవర్ నిద్రమత్తులో బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
Next Story