మేడ్చల్ జిల్లాలో విషాదం.. ఈత‌కు వెళ్లి ఆరుగురు మృతి

One person, five children drown in lake at Jawaharnagar. మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని

By Medi Samrat  Published on  5 Nov 2022 4:13 PM IST
మేడ్చల్ జిల్లాలో విషాదం.. ఈత‌కు వెళ్లి ఆరుగురు మృతి

మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం చెరువులో ఈతకు వెళ్లిన ఆరుగురు చనిపోయారు. ఇందులో ఐదుగురు చిన్నారులు, ఒక యువకుడు ఉన్నాడు. వీరంతా అంబర్ పేట్ నుంచి ఓ ఫంక్షన్ కోసం మల్కారానికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. చిన్నారులు ఈత కోసం చెరువులోకి దిగి బయటకు రాలేక మునిగిపోతుంటే ఆ వ్యక్తి గుర్తించాడు. వారిని రక్షించేందుకు ప్రయత్నించే క్రమంలో ఆ వ్యక్తి సైతం నీట మునిగి చనిపోయాడు. లోతు తక్కువగా ఉందని భావించి.. చెరువులోకి దిగిన వారంతా మునిగిపోయినట్లు తెలుస్తోంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు చెరువు వద్దకు చేరుకున్నారు. స్థానికుల సహకారంతో మృతదేహాలను బయటకు తీశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.


Next Story