కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో ఒక యువకుడు క్రికెట్ బాల్ విషయంలో గొడవ జరిగి కత్తితో పొడిచే స్థాయికి చేరుకుంది. బంతి ఒక ఉపాధ్యాయుడి ఇంట్లో పడింది. ఈ విషయంలో జరిగిన వాదన హింసాత్మక మలుపు తిరిగింది. కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు దాడి చేసి, కత్తితో పొడిచాడు.
మంగళవారం క్రికెట్ ఆడుతూ ఉండగా, బంతి 36 ఏళ్ల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రామప్ప పూజారి ఇంటిపై పడింది. 21 ఏళ్ల పవన్ జాదవ్ దానిని తిరిగి తీసుకోడానికి వెళ్ళినప్పుడు, బంతి ఆ వైపు రాలేదని అతనికి చెప్పారు రామప్ప. ఆయన చెప్పిన మాటలను నమ్మలేదు పవన్. ఆ తరువాత జరిగిన వాగ్వాదంలో ఆ యువకుడు రామప్పను కొట్టడం ప్రారంభించి, విరిగిన సీసా ముక్క, కత్తితో పొడిచాడు. ఉపాధ్యాయుడి ముఖం, తలపై గాయాలు అయ్యాయి. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన CCTV ఫుటేజ్ వైరల్ అయింది.