చాక్లెట్లు ఆశ‌చూపి మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్ప‌డ్డ‌ 70 ఏళ్ల వృద్ధుడు

Old man raped two minor sister took home by luring toffee in jabalpur. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో దారుణ‌ ఘటన వెలుగు చూసింది.

By Medi Samrat  Published on  7 April 2023 4:24 PM IST
చాక్లెట్లు ఆశ‌చూపి మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్ప‌డ్డ‌ 70 ఏళ్ల వృద్ధుడు

ప్ర‌తీకాత్మ‌క చిత్రం


మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో దారుణ‌ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు మైనర్ బాలికలపై 70 ఏళ్ల వృద్ధుడు దారుణానికి పాల్పడ్డాడు. బాలికలిద్దరికీ చాక్లెట్లు ఇప్పించి ఆ వ్యక్తి అత్యాచారం చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు శుక్రవారం పోలీసులు సమాచారం అందించారు. జబల్‌పూర్ జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలోని కటంగి ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు బాలిక‌లు ఇరువురు సొంత అక్కాచెల్లెల్లు కాగా.. వారిలో ఒక‌రి వయస్సు 6 సంవత్సరాలు.. మ‌రొక‌రికి 8 సంవత్సరాలు.

మంగళవారం మధ్యాహ్నం తమ‌ ఇంటి దగ్గర ఆడుకుంటున్న ఇద్దరు అక్కాచెల్లెల్ల‌ను నిందితుడు గిర్ధారి లాల్ సాహు చూశారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) శివేంద్ర సింగ్ తెలిపారు. నిందితుడు చాక్లెట్లు ఇస్తానని చెప్పి బాలికలను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికలు ఇంటికి తిరిగి రాకపోవడంతో తెలిసిన వారితో పాటు.. వారి బంధువులు ఇళ్ల‌ల్లో వెతకగా.. వృద్ధుడి వద్ద కనిపించారని తెలిపారు. బాలికల పరిస్థితిని చూసిన కుటుంబ స‌భ్యులు పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారని శివేంద్ర సింగ్ తెలిపారు. పోలీసులు వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై భారతీయ శిక్షాస్మృతి (IPC), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (POCSO) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


Next Story