ప్రియురాలికి మ‌రొక‌రితో అఫైర్ ఉంద‌ని.. అడ‌విలోకి తీసుకువెళ్లి

Odisha man arrested for murdering girlfriend.ప్రియురాలికి మ‌రొక‌రితో సంబంధం ఉంద‌ని అనుమానించిన ప్రియుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Dec 2022 11:54 AM IST
ప్రియురాలికి మ‌రొక‌రితో అఫైర్ ఉంద‌ని.. అడ‌విలోకి తీసుకువెళ్లి

ప్రియురాలికి మ‌రొక‌రితో సంబంధం ఉంద‌ని అనుమానించిన ప్రియుడు ఆమెను హ‌త‌మార్చాడు. అనంత‌రం మృత‌దేహాన్ని అడ‌విలోకి తీసుకువెల్లి పెట్రోల్ పోసి త‌గ‌ల‌బెట్టాడు. ఈ దారుణ ఘ‌ట‌న చ‌త్తీస్‌గ‌డ్ రాష్ట్రంలో జ‌రిగింది.

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాకు చెందిన తనూ కుర్రే(21) రాయ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ బ్యాంక్‌లో ప‌నిచేస్తుండేది. ఒడిశాలోని బలంగీర్‌కు చెందిన స‌చిన్ అగర్వాత్ తో ఆమె ప్రేమ‌లో ఉంది. త‌నూ నవంబర్ 21న సచిన్ అగర్వాల్‌తో కలిసి బలంగీర్‌కు బయలుదేరింది. ఆ త‌రువాత ఆమె కుటుంబ స‌భ్యులు ఆమెతో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించ‌గా కుద‌ర‌లేదు. రోజులు గ‌డుస్తున్నప్ప‌టికీ కుటుంబ‌స‌భ్యుల్లో ఒక్క‌రితో కూడా త‌నూ ట‌చ్‌లోకి రాక‌పోవ‌డంతో అనుమానించిన కుటుంబ స‌భ్యులు రాయ్‌పూర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

విచారణలో రాయ్‌పూర్ పోలీసులు బలంగిర్‌లో కాలిపోయిన మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహం ఫొటో ఆధారంగా కుటుంబ సభ్యులు తనూ మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం బలంగీర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు మొదట ఆమె ప్రియుడు సచిన్ అగర్వాల్‌ను అనుమానించారు. సచిన్ అగర్వాల్ తన లొకేషన్‌ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండేవాడు. ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో నేరస్థుడు హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తనూ వేరొకరితో ఎఫైర్ నడుపుతున్నట్లు అనుమానం ఉంద‌ని, అందుక‌నే ఆమెను చంపిన‌ట్లు స‌చిన్ చెప్పిన‌ట్లు పోలీసులు తెలిపారు. రైడ్‌కి వెళ‌దామ‌ని చెప్పి ఆమెను అడ‌వికి తీసుకువెళ్లి తుపాకీతో కాల్చి చంపేశాన‌ని అనంత‌రం మృత‌దేహంపై పెట్రోల్ పోసి త‌గ‌ల‌బెట్టిన‌ట్లు చెప్పాడు.

Next Story