వారణాసి గ్యాంగ్ రేప్‌ కేసు.. తొమ్మిది మంది అరెస్ట్.. మ‌రో 13 మంది కోసం అన్వేష‌ణ‌

వార‌ణాసి అత్యాచార ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపింది. యువ‌తిపై అత్యాచారానికి పాల్పడిన 23 మందిలో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat
Published on : 9 April 2025 3:26 PM IST

వారణాసి గ్యాంగ్ రేప్‌ కేసు.. తొమ్మిది మంది అరెస్ట్.. మ‌రో 13 మంది కోసం అన్వేష‌ణ‌

వార‌ణాసి అత్యాచార ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపింది. యువ‌తిపై అత్యాచారానికి పాల్పడిన 23 మందిలో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ జిల్లా ఆసుపత్రిలో నిందితుల‌కు వైద్య ప‌రీక్ష‌లు జ‌రిగాయి. ఆ సమయంలో ఆస్పత్రి ఆవరణలో నిందితుల‌పై దాడి జరిగింది. పోలీసులు ఎలాగోలా వారిని కాపాడారు. నిందితులందరినీ భారీ బందోబస్తుతో రాత్రి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

గత ఆదివారం లాల్‌పూర్ పాండేపూర్ పోలీసులు ఏడు రోజుల్లో 23 మంది నేరస్థుల చేతిలో దారుణానికి గురైన యువ‌తి తల్లి ఫిర్యాదు మేరకు లంకలోని సీర్‌గోవర్ధన్ నివాసి రాజ్ విశ్వకర్మ, హుకుల్‌గంజ్‌కు చెందిన ఆయుష్, బాద్‌షాబాగ్‌కు చెందిన సాజిద్, సుహైల్ షేక్, లల్లాపురానికి చెందిన డానిష్ అలీ, ఇమ్రాన్, షబ్బీర్ ఆలం, ఇంగ్లీషియా లైన్‌కు చెందిన సోహైల్ ఖాన్, శివపూర్‌కు చెందిన అన్మోల్ గుప్తాలపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

నిందితులందరికీ జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందించారు. అక్క‌డ నిందితుల నమూనాలను కూడా తీసుకున్నారు. ఈ ప్రక్రియ అంతా రాత్రి వరకు జరిగింది. వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం వెళ్లిన‌ నిందితులపై భీమ్ ఆర్మీ కార్య‌క‌ర్త‌లుగా చెప్పుకునే యువకులు దాడి చేశారు. ఈ సమాచారం అందిన వెంటనే పలు పోలీసు స్టేషన్ల నుంచి బలగాలు ఆస్పత్రికి చేరుకున్నాయి. దాడి చేసిన యువకులను అదుపులోకి తీసుకున్నారు.

భారీ భద్రత మధ్య, నిందితులను సాయంత్రం సివిల్ జడ్జి ముందు (సీనియర్ డివిజన్ ఫాస్ట్ ట్రాక్) యుగుల్ శంభు కోర్టులో హాజరుపరిచారు. కేసు తీవ్రతను చూసిన కోర్టు అందరినీ జైలుకు పంపింది. ఈ సమయంలో, ఉన్నతాధికారులు మొత్తం విషయం గురించి సమాచారాన్ని తీసుకుంటూనే ఉన్నారు. అరెస్టయిన నిందితుల్లో విద్యార్థులు, వ్యాపారులు ఉన్నారు.

ఇతర నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. యువ‌తిపై అత్యాచారం జరిగిన ప్రదేశాలను కూడా పోలీసులు విచారిస్తున్నారు. అక్కడ అమర్చిన కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. లాల్‌పూర్ పాండేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 19 ఏళ్ల యువతి మార్చి 29న తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి.. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో నిందితుడు రాజ్ విశ్వకర్మ ఆమెను కలుసుకుని లంకలోని తన కేఫ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఏడు రోజుల్లో 22 మంది నిందితులు ఆమెపై వేర్వేరు చోట్ల అత్యాచారానికి పాల్పడ్డారు.

Next Story