పోలీసులపై రాడ్లతో దాడి చేసిన‌ నైజీరియన్స్

కర్ణాటక రాజధాని బెంగుళూరులో నైజీరియన్లు పోలీసులు మీద దాడికి తెగబడ్డారు. నైజీరియన్ పౌరుల బృందం డ్రగ్స్ సేవిస్తున్నారనే సమాచారంతో వారి నివాసంపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) అధికారులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టగా..

By Medi Samrat  Published on  19 April 2024 6:45 PM IST
పోలీసులపై రాడ్లతో దాడి చేసిన‌ నైజీరియన్స్

కర్ణాటక రాజధాని బెంగుళూరులో నైజీరియన్లు పోలీసులు మీద దాడికి తెగబడ్డారు. నైజీరియన్ పౌరుల బృందం డ్రగ్స్ సేవిస్తున్నారనే సమాచారంతో వారి నివాసంపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) అధికారులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టగా.. నైజీరియన్లు ఇనుప రాడ్లు, రాళ్లు, హెల్మెట్‌లతో అధికారులపై దాడి చేశారు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. నైజీరియన్ జాతీయులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించడంతో వారిని పట్టుకోడానికి అధికారులు ప్రయత్నించారు. దాడిలో సీసీబీ ఇన్‌స్పెక్టర్ సుబ్రహ్మణ్య స్వామితో పాటు మరో ఐదుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన రాజనుకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మావల్లిపురలో చోటుచేసుకుంది.

మావల్లిపురలోని ఓ ఇంట్లో డ్రగ్స్‌ ఉన్నాయని సీసీబీకి సమాచారం అందింది. పక్కా సమాచారంతో సీసీబీ అధికారులు నైజీరియన్లు నివాసముంటున్న ఇంటిపై దాడులు చేశారు. అధికారులు నివాసం వద్దకు రాగానే రాడ్లు, హెల్మెట్లతో దాడి చేశారు. సీసీబీ బృందం వెంటనే బ్యాకప్ కోసం పోలీసులను పిలిపించింది. పోలీసు అధికారులపై కూడా నైజీరియన్ జాతీయులు దాడి చేశారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసి, అద్దాలను కూడా పగులగొట్టారు. గాయపడిన సిబ్బంది ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Next Story