గేమింగ్ జోన్‌లో అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మ‌ర‌ణం

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 27 మంది మరణించారు. ఈ ప్రమాదంలో కొత్తగా పెళ్లయిన జంట కూడా ప్రాణాలు కోల్పోయింది.

By Medi Samrat  Published on  27 May 2024 12:45 AM GMT
గేమింగ్ జోన్‌లో అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మ‌ర‌ణం

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 27 మంది మరణించారు. ఈ ప్రమాదంలో కొత్తగా పెళ్లయిన జంట కూడా ప్రాణాలు కోల్పోయింది. కెనడాలో చదువుతున్న అక్షయ్ ధోలారియా, అతని భార్య ఖ్యాతి స్వాలివియా శనివారం సాయంత్రం రాజ్‌కోట్‌లోని TRP గేమ్ జోన్‌లో తమ కోర్టు మ్యారేజ్ ను సెలెబ్రేట్ చేసుకుంటూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఖ్యాతి సోదరి హరిత కూడా ఈ భారీ అగ్నిప్రమాదానికి బలైంది. అక్షయ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌లో వీరిద్దరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరగాల్సి ఉండగా.. ఈ ఘటనలో వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత అమెరికాలో ఉంటున్న అక్షయ్ తల్లిదండ్రులు రాకోట్ కు వచ్చారు. పోలీసులు బాధితురాలి తల్లిదండ్రుల నుంచి డీఎన్‌ఏ నమూనాలు తీసుకుని వారి గుర్తింపును నిర్ధారించారు.

శనివారం, రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది, ఇందులో 12 ఏళ్లలోపు నలుగురు పిల్లలు సహా.. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటన తర్వాత, పోలీసులు TRP గేమ్ జోన్ యజమాని, మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందానికి విచారణను అప్పగించింది. "ఇప్పటివరకు అగ్ని ప్రమాదంలో 27 మంది మరణించినట్లు మేము ధృవీకరించాము. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి, అందువల్ల వారిని గుర్తించడం కష్టం" అని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాధిక భరాయ్ మీడియాతో తెలిపారు.

Next Story