విషాదం.. నవ వధువు అనుమానాస్పద మృతి.. పెళ్లైన 16 రోజులకే

Newly married bride suspected death. గుంటూరు జిల్లాలో నవ వధువు అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. భర్త, అత్త మామల వేధింపులు భరించలేక

By అంజి  Published on  16 Nov 2021 11:51 AM IST
విషాదం.. నవ వధువు అనుమానాస్పద మృతి.. పెళ్లైన 16 రోజులకే

గుంటూరు జిల్లాలో నవ వధువు అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. భర్త, అత్త మామల వేధింపులు భరించలేక నవ వధువు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన గుంటూరు రూరల్‌ మండలం పొత్తూరుటో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నవ వధువు స్వప్న శ్రీకి 16 రోజుల క్రితం పొత్తూరు గ్రామానికి చెందిన గోపాల కృష్ణారెడ్డితో పెళ్లి జరిగింది. పెళ్లి వేడుకకు పుట్టింటి వారు ఘనంగా జరిపించారు. అన్ని లాంఛనాలు చేశారు. సోమవారం నాడు స్వప్న శ్రీ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ విషయం ఆలస్యంగా స్వప్న శ్రీ కుటుంబ సభ్యులకు తెలిసింది.

వెంటనే నవ వధువు కుటుంబ సభ్యులు.. ఆమె అత్తారింటికి చేరుకున్నారు. స్వప్న శ్రీ మృతి పట్ల అనుమానం వ్యక్తం చేశారు. అదనపు కట్నం కోసం కొట్టి చంపారని వధువు బంధువుల ఆరోపణలు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో వధువు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చిన అదనపు కట్నం కోసం అబలకు వేధింపులు ఆగడం లేదు. వరకట్న వేధింపుల కారణంగా ఎంతో మంది మహిళలు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి కఠినాతికఠిన చర్యలు తీసుకుంటే మార్పు రావొచ్చని ప్రజలు అంటున్నారు.

Next Story