మృతదేహం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు వెళ్లి చూడగా..!

Nepalese National Found Dead In West Delhi. పశ్చిమ ఢిల్లీలోని తిలక్ విహార్ ప్రాంతంలో 43 ఏళ్ల నేపాల్ జాతీయుడు శవమై కనిపించాడని పోలీసులు శనివారం తెలిపారు

By M.S.R
Published on : 28 Jan 2023 6:15 PM IST

మృతదేహం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు వెళ్లి చూడగా..!

పశ్చిమ ఢిల్లీలోని తిలక్ విహార్ ప్రాంతంలో 43 ఏళ్ల నేపాల్ జాతీయుడు శవమై కనిపించాడని పోలీసులు శనివారం తెలిపారు. మృతుడిని రాజ్‌కుమార్ గలాన్‌గా గుర్తించారు. అతను నేపాల్‌లోని కాలికాటర్‌ కు చెందిన వాడని పోలీసులు తెలిపారు. తిలక్ విహార్‌లోని సిఆర్‌పిఎఫ్ క్యాంపు సమీపంలో మృతదేహం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (పశ్చిమ) ఘనశ్యామ్ బన్సాల్ తెలిపారు. తిలక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదైంది.

మృతదేహాన్ని పరిశీలించగా గొంతును కోసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. క్రైమ్, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ బృందాలను సంఘటనా స్థలానికి పిలిపించినట్లు అధికారి తెలిపారు. పని వెతుక్కుంటూ వికాస్ పురిలో ఉంటున్న తన స్నేహితులను కలిసేందుకు రాజ్‌కుమార్ వచ్చాడని తెలుస్తోంది. ఘటనాస్థలికి సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.


Next Story