'రోజూ అత‌డితోనే ఆడుకునేది'.. మూడేళ్ల చిన్నారిపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం, హత్య

సైబర్ సిటీ గురుగ్రామ్‌లో మూడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన సంచలనం రేపింది.

By -  Medi Samrat
Published on : 20 Feb 2026 2:02 PM IST

రోజూ అత‌డితోనే ఆడుకునేది.. మూడేళ్ల చిన్నారిపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం, హత్య

సైబర్ సిటీ గురుగ్రామ్‌లో మూడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన సంచలనం రేపింది. సెక్టార్ 37 ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలోని ఖాళీ స్థలంలోని గుంట నుంచి బాలిక‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 24 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు, బాలిక కుటుంబాలు ఒకే భవనంలో నివసిస్తున్నారు. ఆ బాలిక తరచుగా నిందితుడితో ఆడుకునేది.

దర్యాప్తు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లిదండ్రులు నిన్న రాత్రి 12:30 గంటల ప్రాంతంలో కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు రాత్రంతా బాలిక కోసం వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఉదయం ఆమె మృతదేహం లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. విచారణలో అతను నేరం అంగీకరించాడు. దీని తర్వాత బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. ఫోరెన్సిక్ దర్యాప్తు జరుగుతోంది.

Next Story