విద్యార్థికి అర్ధనగ్నంగా వీడియో కాల్స్ చేసిన మహిళా టీచర్

విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించిన 35 ఏళ్ల మహిళా టీచర్‌ను నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat
Published on : 30 July 2025 6:56 PM IST

విద్యార్థికి అర్ధనగ్నంగా వీడియో కాల్స్ చేసిన మహిళా టీచర్

విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించిన 35 ఏళ్ల మహిళా టీచర్‌ను నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ విద్యార్థికి సోషల్ మీడియా ద్వారా అసభ్యకర సందేశాలు పంపింది. అర్ధనగ్నంగా ఉంటూ బాలుడితో వీడియో కాల్స్ నడుపుతూ ఉంది. గత కొన్ని నెలలుగా ఆమె ఇలాగే ప్రవర్తిస్తుండడంతో, విద్యార్థి మానసికంగా కుంగుబాటుకు గురయ్యాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నారు. పాఠశాల యాజమాన్యం ఈ ఘటనపై స్పందిస్తూ, ఆమెను విధుల నుంచి తొలగించింది.

Next Story