కనికరం లేకుండా 8 నెలల పసికందును.. క్రూరంగా కొట్టిన ఆయా.. సీసీ కెమెరాలో రికార్డ్‌

Nanny brutally beats 8-month-old baby .. Incident in Gujarat. గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో 8 నెలల పసికందును.. కేర్‌టేకర్ నిర్దాక్షిణ్యంగా కొట్టిన దారుణ ఘటన చోటుచేసుకుంది. దాడి కారణంగా

By అంజి  Published on  5 Feb 2022 8:00 AM GMT
కనికరం లేకుండా 8 నెలల పసికందును.. క్రూరంగా కొట్టిన ఆయా.. సీసీ కెమెరాలో రికార్డ్‌

గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో 8 నెలల పసికందును.. కేర్‌టేకర్ నిర్దాక్షిణ్యంగా కొట్టిన దారుణ ఘటన చోటుచేసుకుంది. దాడి కారణంగా బ్రెయిన్ హెమరేజ్‌తో బాధపడుతున్న చిన్నారి ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. చిన్నారి కుటుంబం సూరత్‌లోని రాందర్ పాలన్‌పూర్ పాటియాలో నివసిస్తోంది. పిల్లల తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగంలో ఉన్నారు. వారి పిల్లలను చూసుకోవడానికి ఒక కేర్‌టేకర్‌ను నియమించుకున్నారు. అయితే వారు లేకపోవడంతో తమ పిల్లలు ఏడుస్తున్నారని ఇరుగుపొరుగు వారికి తెలియజేయడంతో దంపతులు తమ ఇంట్లో సీసీ కెమెరాను అమర్చారు.

కాగా కేర్‌టేకర్ చిన్నారిని కిరాతకంగా కొట్టిన దృశ్యాన్ని కెమెరాలో బంధించారు. వీడియోలో, ఆమె పదేపదే పిల్లల తలను మంచంపై కొట్టడం కనిపిస్తుంది. ఆమె చిన్నారి జుట్టును తిప్పడం, కనికరం లేకుండా అతనిని కొట్టడం కూడా కనిపిస్తుంది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహిళను అదుపులోకి తీసుకున్నారు. మీడియాతో మాట్లాడిన చిన్నారి అమ్మమ్మ కలాబెన్ పటేల్.. నిందితురాలు కోమల్ చంద్లేకర్‌ను మూడు నెలల క్రితమే ఉద్యోగంలోకి తీసుకున్నారని చెప్పారు.

కోమల్ మొదట్లో పిల్లలను బాగా చూసుకునేది. అయితే ఆమె సంరక్షణలో పిల్లలు ఏడుస్తూనే ఉండడంతో అనుమానం వచ్చింది. దీంతో తల్లిదండ్రులు సీసీటీవీ కెమెరాను అమర్చడంతో దారుణం వెలుగు చూసింది. సూరత్‌లోని రాందర్ పోలీస్ స్టేషన్‌లో 8 నెలల చిన్నారి తండ్రి మితేష్ పటేల్ నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలికి పెళ్లయి 5 ఏళ్లు అవుతోంది, అయితే ఆమెకు సొంత బిడ్డ లేదు.

Next Story
Share it