పూడ్చిన శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం.. అసలు ఏమయ్యిందంటే..
Nandigama Crime News. కృష్ణా జిల్లా నందిగామలో గత నెల 18వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన
By Medi Samrat Published on
19 July 2021 8:31 AM GMT

కృష్ణా జిల్లా నందిగామలో గత నెల 18వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గుంజి వేదాద్రి అనే వ్యక్తి అంత్యక్రియలు జరిగాయి. మృతుడు విజయవాడకు సమీపంగా ఉన్న ఎనికేపాడులో అనుమానాస్పద స్థితిలో శవపై కనిపించాడు. ఈ నేఫథ్యంలోనే గత నెల 18వ తేదీన మృతదేహనికి బంధువులు నందిగామలో కార్యక్రమాలు చేశారు. అయితే.. ఈ మృతిపై మొదటి భార్య చెల్లెలు నీలిమ అనుమానాలు ఉన్నాయని విజయవాడ పడమట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
వేదాద్రి పెద్ద మనుషుల సమక్షంలో మొదటి భార్యతో విడిపోయాడు. రెండవ భార్య దుర్గపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ఇల్లు అమ్మి డబ్బులు వచ్చిన తరువాత మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేఫథ్యంలోనే విజయవాడ పోలీసులు నందిగామ పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. దీంతో నందిగామ పోలీసులు.. పూడ్చిన వేద్రాద్రి శవానికి అధికారుల సమక్షంలో బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు రాగానే.. వేద్రాద్రిది సహజ మరణమా లేక హత్యనా అన్న విషయం తెలియనుంది.
Next Story