అమెరికాలో కాల్పులు.. న‌ల్గొండ సాప్ట్‌వేర్ ఇంజ‌నీర్ మృతి

Nalgonda man shot dead in US. నల్గొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నక్కా సాయి చరణ్ (26) ఆదివారం

By Medi Samrat  Published on  22 Jun 2022 10:25 AM IST
అమెరికాలో కాల్పులు.. న‌ల్గొండ సాప్ట్‌వేర్ ఇంజ‌నీర్ మృతి

నల్గొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నక్కా సాయి చరణ్ (26) ఆదివారం సాయంత్రం అమెరికాలోని మేరీల్యాండ్‌లో మృతిచెందాడు. కొడుకు చనిపోయాడని అతని తల్లిదండ్రులకు అమెరికా నుంచి సమాచారం వచ్చింది. సాయి చరణ్ మ‌ర‌ణవార్త విన్న తల్లిదండ్రులు క‌న్నీరుమ‌న్నీరుగా విల‌పిస్తున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లోని కాటన్స్‌విల్లే సమీపంలో సాయి చరణ్ కారులో వెళ్తుండగా ఓ నల్లజాతీయుడు కాల్పులు జ‌రిపాడు. కాల్పుల్లో సాయి చరణ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.

దీంతో సాయి చరణ్ ను యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ R. ఆడమ్స్ కౌలీ షాక్ ట్రామా సెంటర్‌కు తరలించారు, అక్కడ అతను కొద్దిసేపటి తర్వాత మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. సాయి చరణ్ తలపై తుపాకీ గాయం కనిపించింది. సాయి చరణ్‌ తన స్నేహితుడిని ఎయిర్‌పోర్టులో దించి కారులో తన నివాసానికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సాయి చరణ్ గత రెండేళ్లుగా అమెరికాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.









Next Story