విజయవాడ పాతబస్తీలో దారుణ హత్య
Murder In Vijayawada Old City. విజయవాడ పాతబస్తీ వించిపేటలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్‌లో
By Medi Samrat Published on
1 Sep 2021 10:14 AM GMT

విజయవాడ : విజయవాడ పాతబస్తీ వించిపేటలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్‌లో నివాసం ఉండే ఇమ్రాన్ (32) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గత రాత్రి స్నేహితులతో మాటమాట పెరిగి గొడవకు దారితీసింది. గొడవ పెరగడంతో ప్రత్యర్థులు ఇమ్రాన్ ను హత్య చేశారు. అర్థరాత్రి జరిగిన ఈ హత్య విజయవాడ నగరంలో కలకలం రేపింది. ఇమ్రాన్ ను జాఫర్ అనే ఆటో డ్రైవర్ హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం సేకరించారు. ఇమ్రాన్, జాఫర్ ల మధ్య డబ్బు విషయంలో అర్ధరాత్రి ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. ఇమ్రాన్‌ను విచక్షణా రహితంగా కత్తితో నరికి దుండగులు పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని.. దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఇమ్రాన్ గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు సమాచారం.
Next Story