బెజవాడలో మరో దారుణ హత్య
Murder In Vijayawada. బెజవాడలో మరో దారుణ హత్య చోటుచేసుకుంది. బిజినెస్ మ్యాన్ రాహుల్ మర్డర్ కేసును
By Medi Samrat Published on 1 Nov 2021 4:29 PM ISTబెజవాడలో మరో దారుణ హత్య చోటుచేసుకుంది. బిజినెస్ మ్యాన్ రాహుల్ మర్డర్ కేసును మరిచిపోక ముందే మరో హత్య జరిగింది. తాజాగా ఓ బిల్డర్ ను హత్య చేశారు. బిల్డర్ అప్పలరాజును దారుణంగా హత్య చేశారు. బిల్డర్ అప్పలరాజు ఉంటున్న ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు అతడిని దారుణంగా హత్య చేశారు. విజయవాడ శివారు ప్రాంతమైన దేవినేని గాంధీపురంలో పీతల అప్పలరాజు అనే బిల్డర్ తన ఇంట్లో నిద్రిస్తుండగా కొందరు దుండగులు హత్య చేశారు. రక్తపు మడుగుల్లో మృతదేహం పడి ఉండటంతో గమనించిన సన్నిహితులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అప్పలరాజు నిద్రిస్తున్న సమయంలోనే అతన్ని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబం విశాఖలో నివాసం ఉంటోందని వెల్లడించారు.
హత్య జరిగిన వెంటనే అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటన స్థలంలో క్లూస్ ఆధారాలు సేకరించే పనిలో పడింది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విజయవాడ నార్త్ ఏసీపీ షేక్ షా దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్య జరిగిన ప్రాంతంలో పోలీసు జాగిలాలు తిరిగాయి.. హత్య జరిగిన ప్రాంతం నుంచి సమీపంలోని బ్రాందీ షాపు, చుట్టుపక్కల ఇళ్ల మధ్య తిరిగాయి. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నామని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలు కూడా లభ్యమైనట్లు ఏసీపీ తెలిపారు.