శ్రీకాళహస్తిలో తాంత్రికుడు దారుణ హత్య

Murder In Srikalahasti. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది.

By Medi Samrat
Published on : 21 Dec 2022 7:45 PM IST

శ్రీకాళహస్తిలో తాంత్రికుడు దారుణ హత్య

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. తాంత్రికుడు చంద్రగిరి చంద్రయ్య దారుణ హత్య కు గురయ్యాడు. శ్రీకాళహస్తి టైలర్స్ కాలనీలో దారుణం జరిగింది. తాంత్రికుడు చంద్రయ్యను గుర్తు తెలియని దుండగులు నరికి చంపారు. ఏళ్ల తరబడి చంద్రయ్య స్థానికంగా శాంతిపూజలు చేయడంతో పాటు పలు పూజలు చేస్తూ ఉంటాడు.

క్షుద్ర పూజలు చేస్తున్నాడన్న అనుమానంతో చంద్రయ్యను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చంద్రయ్య హత్యపై స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రయ్య మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. హత్యకు దారి తీసిన కారణాలపై ఆరాతీస్తున్నారు పోలీసులు.


Next Story