రౌడీ షీటర్ దారుణ హత్య

Murder In Rajahmundry. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గుర‌య్యాడు

By Medi Samrat  Published on  25 Sep 2021 8:30 AM GMT
రౌడీ షీటర్ దారుణ హత్య

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గుర‌య్యాడు. నగరంలో బ్లేడ్‌ బ్యాచ్‌కు, రౌడీ షీటర్‌కు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక పనస చెట్టు ఏరియాలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. త్రీ టౌన్‌ పోలీస్ స్టేషన్ పరిధి సీటీఆర్ఐ ప్రాంతంలో నివాసం ఉంటున్న దొంగ రెడ్డి(28) అనే రౌడీ షీటర్ కు, అతని ప్రత్యర్ధులు బ్లేడ్ బ్యాచ్ షూటర్ సాయి, రౌడీషీటర్ లక్ష్మణ్‌తో పాటు మరో ఇద్దరితో పాత కక్షలు ఉన్నాయని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో వీరి మ‌ధ్య‌ గత నాలుగు రోజులుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం రాత్రి కూడా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిందని.. తరువాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయినట్లు స్థానికుల సమాచారం. అయితే.. మద్యం మత్తులో ఉన్న షూటర్ సాయి అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత.. ఇంటి మేడపై పడుకున్న దొంగ రెడ్డిని నిద్రలేపి వెంట తెచ్చుకున్న మారణాయుదంతో విచక్షణా రహితంగా దాడిచేశాడు. దీంతో రౌడీ షీటర్ దొంగ రెడ్డి అక్కడికక్కడే కుప్పకూలాడు. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న‌ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప‌రిశీలించారు. దీనిపై త్రీ టౌన్‌ పోలీస్ స్టేషన్ సీఐ మధుబాబు మాట్లాడుతూ.. నిందితుల కోసం గాలిస్తున్నామని.. ఇరువర్గాల మధ్య పాత కక్షలు ఉన్న నేపథ్యంలో ఈ దారుణ హత్య జరిగిందన్నారు.


Next Story
Share it