యువకుడి మర్మాంగాలు కోసేసి హత్య.. పీక్కుతిన్న పందులు.. దారుణం
Murder In Narayankhed. రక్తపు మడుగుల్లో పడిన ఓ మృతదేహాన్ని పందులు పీక్కుతిన్న సంఘటన
By Medi Samrat Published on 16 Dec 2020 5:09 PM IST
రక్తపు మడుగుల్లో పడిన ఓ మృతదేహాన్ని పందులు పీక్కుతిన్న సంఘటన నారాయణఖేడ్ జంట గ్రామమైన మంగల్ పేటలో చోటుచేసుకుంది. కల్హేర్ మండలం ఖాజాపూర్‌కు చెందిన వడ్డె రాజు (23) ఇస్నాపూర్‌లో పనికి వెళ్తున్నానని సోమవారం ఇంట్లో చెప్పి మంగళవారం శవమై కనిపించాడు. అత్యంత పాశవికంగా హత్యకు గురైన ఆ యువకుడి మృతదేహాన్ని చిల్లచెట్లల్లో పందులు తింటుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నారాయణఖేడ్ పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
దారుణ హత్య..
పక్కా ప్రణాళిక ప్రకారమే వడ్డె రాజు హత్య జరిగినట్లు తెలుస్తోంది. దుండగులు వడ్డెరాజు తలపై బండ రాళ్లతో మోది ఆ తర్వాత మృతుడి మర్మాంగాన్ని కోసేశారు. మృతుడి ఒంటిపై ఉన్న దుస్తుల్లో ఒక పర్సు, ఆధార్ కార్డు జెరాక్స్ కాపీని స్వాధీనం చేసుకున్నారు. వివరాల ఆధారంగా మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడి సోదరుడు వడ్డె సునీల్ వచ్చి మృతదేహం వడ్డె రాజుదిగా గుర్తించాడు. సంఘటనా స్థలంలో రక్తంతో తడిచిన రెండు బండరాళ్లు, రెండు జతల చెప్పులు లభ్యమయ్యాయి. సీఐ రవీందర్‌రెడ్డి క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించారు. పోలీసు జాగిలం మృతదేహం వద్ద ఉన్న చెప్పులను వాసన చూసి సంఘటన స్థలానికి దగ్గర్లోని పెట్రోల్ బంక్ వరకూ వెళ్లి తిరిగి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.