స‌త్తెనపల్లిలో దారుణం.. త‌ల్లీకూతుళ్ల హ‌త్య‌

Murder In Guntur District. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ప‌ట్ట‌ణంలోని

By Medi Samrat  Published on  28 Aug 2021 3:06 PM GMT
స‌త్తెనపల్లిలో దారుణం.. త‌ల్లీకూతుళ్ల హ‌త్య‌

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ప‌ట్ట‌ణంలోని నాగార్జున నగర్ లో శ‌నివారం సాయంత్రం ఇద్దరు మహిళలను దారుణంగా హత్యచేశారు దుండగులు. ఇంట్లో ఉన్న తల్లి, కూతురిపై కిరాత‌కంగా క‌త్తుల‌తో దాడి చేశారు దుండ‌గులు. దీంతో అక్కడిక్కడే మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. మృతులను ప్రత్యూష(25), తల్లి పద్మావతి(55) గా గుర్తించారు. పొలం వివాదం నేప‌థ్యంలో హత్య జరిగినట్లు భావిస్తున్నారు. హ‌త్య ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంబించారు.


Next Story
Share it