ఎంత‌కు తెగించారు.. 77 ఏళ్ల వృద్ధురాలిని 30 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేసి రూ.3.8 కోట్లు దోచుకున్నారు..!

ముంబైలోని మాయానగర్‌లో సైబ‌ర్ దుండ‌గ‌లు 77 ఏళ్ల వృద్ధురాలిని రూ.3.8 కోట్లు మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat  Published on  26 Nov 2024 1:27 PM GMT
ఎంత‌కు తెగించారు.. 77 ఏళ్ల వృద్ధురాలిని 30 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేసి రూ.3.8 కోట్లు దోచుకున్నారు..!

ముంబైలోని మాయానగర్‌లో సైబ‌ర్ దుండ‌గ‌లు 77 ఏళ్ల వృద్ధురాలిని రూ.3.8 కోట్లు మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ తన భర్తతో కలిసి దక్షిణ ముంబై ప్రాంతంలో నివసిస్తోంది. నిందితులు మహిళను దాదాపు నెల రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేశారు. ఎక్కువ కాలం డిజిటల్‌ అరెస్ట్‌ కావడం ఇదే తొలిసారి అని పోలీసులు భావిస్తున్నారు. ఆ మహిళకు దుండ‌గ‌లు తమను తాము ఐపీఎస్ అధికారులుగా ప‌రిచ‌యం చేసుకున్నారు. కోట్లాది రూపాయలు మోసపోయిన ఆ మహిళ డబ్బులు తిరిగి రాకపోవడంతో విషయాన్ని తన కుమార్తెకు తెలియజేసింది. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

వృద్ధురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మొదట ఆమెకు వాట్సాప్ కాల్ వచ్చింది. తైవాన్‌కు పంపిన మీ పార్శిల్ ఆపివేయబడిందని కాల్ చేస్తున్న వ్యక్తి చెప్పాడు. అందులో అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయని మోసగాడు చెప్పాడు. ఆ తర్వాత నకిలీ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తానని బెదిరించాడు. పార్శిల్‌లో బ్యాంకు కార్డులు, ఐదు పాస్‌పోర్టులు, నాలుగు కిలోల బట్టలు, ఎండీఎంఏ డ్రగ్స్‌ ఉన్నాయని ఆ వ్యక్తి చెప్పాడు. తైవాన్‌కు తాను ఎలాంటి పార్శిల్ పంపలేదని వృద్ధురాలు తెలిపింది. దీని తర్వాత మోసగాడు కొత్త ట్రిక్ ప్లే చేశాడు. మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అయిందని అన్నారు. మీరు ముంబై పోలీసు అధికారిని సంప్రదించాలి అని చెప్పి మోసగాడు మహిళ కాల్‌ను నకిలీ పోలీసు అధికారికి బదిలీ చేశాడు. మీ ఆధార్ కార్డుపై మనీలాండరింగ్ కేసు న‌మోదైంద‌ని బెదిరించారు. దుండగులు మహిళకు నోటీసులు కూడా పంపారు. అందులో క్రైమ్ బ్రాంచ్ నకిలీ సీల్ ఉంది. ఇక్కడి నుంచే వృద్ధురాలు నిందితులను నమ్మడం ప్రారంభించింది. కానీ ఆమె ఉచ్చులో చిక్కుకుందని ఆమెకు తెలియదు.

మోసగాళ్లు మహిళను స్కైప్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీడియో కాల్‌లో ఒక వ్యక్తి తనను తాను IPS అధికారి ఆనంద్ రాణాగా పేర్కొన్నాడు. సదరు మహిళ నుంచి నకిలీ ఐపీఎస్ బ్యాంకు ఖాతా వివరాలు అడిగారు. కొంత సమయం తరువాత వీడియో కాల్‌లో మరొక నకిలీ ఐపిఎస్ ప్రత్యక్షమయ్యాడు. తన పేరును ఐపీఎస్ జార్జ్ మాథ్యూగా వెల్లడించాడు. మీరు డబ్బును బదిలీ చేయాల్సి ఉంటుందని నిందితుడు మహిళతో చెప్పాడు. విచారణలో మీరు నిర్దోషి అని తేలితే.. మీ డబ్బు తిరిగి ఇవ్వబడుతుందని పేర్కొన్నాడు.

నిందితులు వృద్ధురాలిపై 24 గంటలు వీడియో కాల్ ద్వారా నిఘా ఉంచారు. కాల్ డిస్‌కనెక్ట్ చేస్తే చిత్రహింసలకు గురిచేశారు. పదే పదే వీడియో కాల్‌లోనే ఉండమని అడిగారు. దాదాపు నెల రోజుల పాటు ఈ తంతు కొనసాగింది. ఈ స‌మ‌యంలోనే నిందితులు మహిళను రూ.3.8 కోట్లు మోసం చేశారు. ఆ మహిళ ఇద్దరు పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు. పదవీ విరమణ పొందిన భర్తతో కలిసి ఆమె ఇంట్లోనే నివసిస్తోంది. తన కుమార్తె సలహా మేరకు ఆ మహిళ 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు విషయాన్ని తెలియజేసింది. ఆ తర్వాత పోలీసులు నిందితుల ఆరు బ్యాంక్‌ ఖాతాలను సీజ్ చేశారు.

Next Story