మైనర్ పనిమనిషిపై ముంబై నటి దాడి.. బట్టలు విప్పించి అశ్లీల వీడియోలు తీసి, చెప్పులతో కొడుతూ..

Mumbai woman assaults, shoots undressed videos of minor house help over delay in work. పని పూర్తి చేయడంలో జాప్యం జరుగుతోందన్న కారణంగా ఇంటి మైనర్ పనిమనిషిపై ఓ 25 ఏళ్ల నటి తన క్రూరత్వాన్ని బయటపెట్టింది.

By అంజి  Published on  13 Dec 2021 8:18 AM GMT
మైనర్ పనిమనిషిపై ముంబై నటి దాడి.. బట్టలు విప్పించి అశ్లీల వీడియోలు తీసి, చెప్పులతో కొడుతూ..

పని పూర్తి చేయడంలో జాప్యం జరుగుతోందన్న కారణంగా ఇంటి మైనర్ పనిమనిషిపై ఓ 25 ఏళ్ల నటి తన క్రూరత్వాన్ని బయటపెట్టింది. ముంబైలోని వెర్సోవా పోలీసులు తన ఇంటి మైనర్‌ పనిమనిషిపై దాడి చేసినందుకు 25 ఏళ్ల నటిని అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. నటి తన మైనర్ ఇంటి పనిమనిషిని బట్టలు విప్పి హింసించింది. 17 ఏళ్ల బాలికను హింసించి అసభ్య వీడియోలు, చిత్రాలను కూడా తీసింది.తన పనిని సమయానికి పూర్తి చేయనందుకు మైనర్ వర్కర్‌పై దాడి చేసి చెప్పులతో కొట్టింది. నిందితురాలు వెర్సోవా నివాసి, ఆమె ఒక ఫ్లాట్‌లో ఒంటరిగా నివసిస్తోంది. జరిగిన నేరం సోమవారం సాయంత్రం నుండి అర్థరాత్రి వరకు కొనసాగింది.

"పనిలో జాప్యం కారణంగా మహిళ మైనర్‌ను చిత్రహింసలకు గురి చేయడం ప్రారంభించింది. ఆమె తన బట్టలు బలవంతంగా తొలగించి అసభ్యకర చిత్రాలు, వీడియోలు తీసింది. ఆమె మైనర్ పనిమనిషిపై కూడా చెప్పులతో దాడి చేసింది. ఆ తర్వాత బాలిక ఇంటి నుండి వెళ్లిపోయింది. కానీ ఆమె తలకు తీవ్రం గాయం అయ్యింది. అని పోలీసులు చెప్పారు. మైనర్‌ బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె బంధువులలో ఒకరు గాయం గురించి ఆమెను అడిగారు. ఆమె మొత్తం జరిగిన విషయాన్ని వివరించింది. ఆ తర్వాత నిందితురాలు అయిన నటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.

ఆ తర్వాత డిసెంబర్ 8న ఆమెను అరెస్ట్ చేశారు. "ఆమెను భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 326, 354 (b), 504 మరియు POCSO చట్టంలోని ఇతర సెక్షన్ల కింద అరెస్టు చేశారు. ఆ మహిళ ఢిల్లీ, ముంబై మధ్య తరచుగా ప్రయాణిస్తుంటుంది. ఆ అమ్మాయి ఒక మైనర్ అని తెలిసిన తర్వాత కూడా, ఆమెను ఇంటి సహాయకురాలిగా నియమించుకుంది" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తనపై పలుమార్లు దాడి చేశారని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితురాలు ముంబయిలోని అంధేరీ వెస్ట్‌లోని హౌసింగ్ కాంప్లెక్స్‌లో నివసిస్తోంది.

Next Story
Share it