అనుమానం పెనుభూతమైతే ఏ ఘోరానికైనా పాల్పడతారని మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న ఓ ఘటన ద్వారా అర్థమవుతోంది. భార్య‌పై అనుమానం పెంచుకున్న ఓ భ‌ర్త.. ఆమె జ‌న‌నేంద్రియాల‌ను కుట్టేసి పారిపోయిన దారుణ ఘటన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో వెలుగు చూసింది. రైలా గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తి త‌న భార్య త‌న‌ను మోసం చేస్తుంద‌ని, మ‌రొక‌రితో సంబంధం పెట్టుకున్న‌ట్లు అనుమానించాడు. దీంతో ఆమె జ‌న‌నేంద్రియాల‌ను కుట్టేశాడు.

బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ప‌రారీలో ఉన్న తన భ‌ర్త‌ను ఏం చేయొద్ద‌ని, చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని భార్య పోలీసుల‌ను కోరింది. రెండు మంచి మాట‌లు చెప్పి పంపించాల‌ని, ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతమైతే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించి పంపించాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది ఆమె. ప్ర‌స్తుతం బాధిత మ‌హిళ‌కు చికిత్స కొన‌సాగుతోంది. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన ఆమె భర్తను పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


M.S.R

నేను M.S.R., న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో కహానియా, చిత్రం భళారే, న్యూసు, పబ్లిక్ టీవీ తెలుగు త‌దిత‌ర వార్త సంస్థ‌ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Next Story