క్షణికావేశం.. నలుగురు పిల్లలతో కలిసి బావిలోకి దూకిన త‌ల్లి

MP woman jumps into well with 4 children. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో 30 ఏళ్ల మహిళ ఆదివారం నాడు తన నలుగురు పిల్లలతో కలిసి బావిలోకి దూకింది.

By Medi Samrat  Published on  27 March 2023 8:15 PM IST
క్షణికావేశం.. నలుగురు పిల్లలతో కలిసి బావిలోకి దూకిన త‌ల్లి

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో 30 ఏళ్ల మహిళ ఆదివారం నాడు తన నలుగురు పిల్లలతో కలిసి బావిలోకి దూకింది. నీటిలోకి దూకిన మహిళ.. ఆ తర్వాత ప్రాణ భయంతో తన పెద్ద కుమార్తెను తీసుకుని బావి నుండి బయటకు వచ్చింది. బావిలోని తాడును పట్టుకుని బయటకు వచ్చింది. ఆమె క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కారణంగా.. ఆమె ముగ్గురు పిల్లల ప్రాణాలు పోయాయి. చనిపోయిన వారిలో 18 నెలల కుమారుడితో పాటూ.. మూడు, ఐదు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

బుర్హాన్‌పూర్ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్ది గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ కుమార్ తెలిపారు. ప్రమీలా భిలాలా అనే మహిళ తన భర్త రమేష్‌తో గొడవపడిన తర్వాత ఈ దారుణానికి ఒడిగట్టింది. ప్రమీల ఇంటికి సమీపంలో ఉన్న బావిలో నుంచి ముగ్గురు పిల్లల మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇక ప్రమీల, ఆమె 7 ఏళ్ల కుమార్తె పరిస్థితి బాగానే ఉందని పోలీసులు తెలిపారు.


Next Story